
భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1.. ఎల్‌ఎఫ్.7లను గుర్తించారని పేర్కొంది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్.7కు సంబంధించిన 4 కేసులు ఈ నెలలోనే తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.మరోవైపు.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగానే ఉందని.. బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.