
భారతదేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఈ రైల్వే స్టేషన్ పేరు రాణి కమలాపతి. గతంలో దీనిని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. అతిపెద్ద పార్కింగ్ స్టేషన్,ఎయిర్ కండిషన్డ్ గదులు, ఆఫీసులు, దుకాణాలు, హై స్పీడ్ ఎస్కలేటర్, లిఫ్ట్, కన్వెన్షన్ సెంటర్, హోటల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వంటి ఉంటాయి. ఈ స్టేషన్ నిర్వహణను ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది, కానీ అది భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది.