కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. దేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు తెలిపారు. ‘నేటి కేరళ ఆవిర్భావ దినోత్సవం చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే కేరళను అత్యంత పేదరికం లేని మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మేము విజయం సాధించాం. ఈ శాసనసభ అనేక చారిత్రక చట్టాలు, విధాన ప్రకటనలకు సాక్షిగా నిలిచింది. నవ కేరళ సృష్టిలో మరో మైలురాయిని గుర్తించే తరుణంలో అసెంబ్లీ ఇప్పుడు సమావేశమైంది’ అని అన్నారు.

