ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించామని అన్నారు. “ఇంత వేగంగా పరిశ్రమకు భూసేకరణ, అనుమతులు ఇచ్చింది దేశంలో ఒక్క ఏపీలోనే.. దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అందరికీ పిలుపునిస్తున్నాను” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

