తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టోక్యో తర్వాత రెండవ సెంటర్ కావడం విశేషం. ఈ సేఫ్టీ సెంటర్ సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఈ కేంద్రం భారతదేశానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్‌గా తీర్చిదిద్దుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.

