
దుల్కర్ సల్మాన్ కి చెందిన నిర్మాణ సంస్థ “వేఫేరర్ ఫిలిమ్స్” సంస్థలో పని చేసిన దినిల్ బాబు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశాడని పేర్కొంది. ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని.. బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో వేఫేరర్ ఫిలిమ్స్ వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థతో,నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్ట్‌కి కూడా దినిల్ బాబుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.