దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దీపావళి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి సందడి కొనసాగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ సందడి చేస్తున్నారు. టపాసుల మోతతో పల్లెలు, పట్టణాలు మార్మోగిపోతున్నాయి. టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

