
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానికి సొంత ఊరు అయిన బరేలీలోని వారి ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు గాజియాబాద్‌లో రవీంద్ర అలియాస్ కుల్లు , అరుణ్ ఉన్నట్లుగా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు వెళ్లారు. అయితే వారిద్దరూ కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎదురు కాల్పులు జరిపి వారిని పట్టుకున్నారు.కానీ బుల్లెట్ గాయాలతో వారు చనిపోయారు.