ఒడిశాలోని కటక్ జిల్లాలో ఐఏఎస్ అధికారిణి ఆరాధన దాస్, ఒడిశా హోం శాఖలో అదనపు కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నది. కటక్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీడీఏ) ప్రాంతంలో భూమి ఇప్పిస్తానని దివ్యాంగుడైన కమల్ కుమార్ భావ్‌సింకాను నమ్మించి రూ.95 లక్షలు తీసుకున్నది. కమల కుమార్ భార్య బీనా బ్యాంకు ఖాతాల ద్వారా రెండు వేర్వేరు తేదీల్లో డబ్బును ఆమెకు బదిలీ చేశారు.
ఆ డబ్బు అడిగిన ఆ వ్యక్తిని చంపుతానని బెదిరించింది. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

