
అంబటి రాయుడు పేరు చెబితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఎక్కడో కాలుతుంది. వీలు కుదిరినప్పుడల్లా ఆర్సీబీని.. ఆర్సీబీ ఫ్యాన్స్ కు చురకలు పెడుతూ ఉంటాడు. అంబటి రాయుడిపై ఆర్సీబీ అభిమానులు పై చేయి సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ ను వారి సొంత మైదానం అయిన చెపాక్ లో ఆర్సీబీ ఓడించింది. ఈ మ్యాచ్ లో విజయం అనంతరం ఆర్సీబీ ఫ్యాన్స్ పేజీలో సీఎస్‌కేపై ఆర్‌సీబీ విజయాన్ని ప్రస్తావిస్తూ రాయుడి పెట్టిన ఓ పోస్ట్ పై అభిమానులు సెటైర్లు పేల్చారు.