పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని కేటీఆర్ అభివర్ణించారు.

