ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “రేవంత్ రెడ్డి.. నీకు దమ్ముంటే నన్ను విచారించినప్పుడు తీసిన పూర్తి వీడియోను బయటపెట్టు. అంతేగానీ నీ పత్రికలకు చిల్లర లీకులు ఇవ్వొద్దు” అని ఘాటుగా హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనను ‘లీకుల ప్రభుత్వం – స్కాముల ప్రభుత్వం’గా హరీశ్ రావు అభివర్ణించారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

