
ఒక కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ప్రయత్నించిన డాక్టర్ ఆ సిరప్ తాగిన తర్వాత స్పృహ కోల్పోయాడు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. కేసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సమ్మేళన దగ్గు సిరప్‌ను ప్రభుత్వ హాస్పిటల్స్‌కు సరఫరా చేస్తున్నారు.