
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదానికి సంబంధించిన కేసులో ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నేడు విచారణకు రాగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నవంబర్ 14న జరగబోయే తదుపరి విచారణకు దగ్గుబాటి వెంకటేశ్‌తో పాటు, రానా, అభిరామ్, సురేశ్ బాబు తప్పనిసరిగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడానికి కచ్చితంగా నలుగురూ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది.