
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యావాదాలు తెలియజేశారు. ట్రంప్ శుభాకాంక్షల నేపథ్యంలో ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ స్పందించారు. ‘మీ ఫోన్ కాల్‌కు, దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ వెలుగుల పండుగ నాడు, మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. ఇరు దేశాలు అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని మోదీ ట్వీట్ చేశారు