
‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్ వివాదం కారణంగా కర్ణాటకలో ఆయన చిత్రాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కమల్ హాసన్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా పిటిషన్ దాఖలు చేసారు. జూన్ 5న ‘థగ్ లైఫ్’ సినిమాకి ఎలాంటి ఆటంకం కలగకుండా సవ్యంగా రిలీజ్ అయ్యేలా చూడాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు.