
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిసి ప్రయాణీకులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిసి బస్సుల్లో వైఫై సేవలు అందించేందుకు ఓ ప్రైవేటు సంస్థ రవాణా శాఖకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు ఈ విషయంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినుట్ల సమాచారం. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా అప్లోడెడ్ కంటెంట్‌ను వై-ఫై ద్వారా మొబైళ్లలో చూసే అవకాశాన్ని కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. తద్వారా ముందే ఎంపిక చేసిన సినిమాలు, పాటల జాబితా మాత్రమే చూడటానికి వీలుంటుంది.