విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ చంచల్గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సయీదా బేగంను హైదరాబాద్ నుంచి విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఫారిన్ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ ద్వారా సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్ళేలా ప్రోత్సహించడంలో సయీదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

