బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా వాయుగుండంగా బలహీనపడింది. ఆరుగంటలుగా 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నది. భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మంకు 100 కిలోమీటర్లు, ఒడిశా మల్కాన్‌గిరికి 130 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి క్రమంగా తుపాను బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

