ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతుబంధు నిధులతో మొదలుపెట్టాడని విమర్శించారు. సంవత్సరానికి రూ. 1,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి ఈసారి కూడా రైతుబంధును ఎగ్గొట్టాడని మండిపడ్డారు.

