
తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందాల ద్వారా, రాబోయే 1-2 సంవత్సరాల్లో జపాన్లోని వివిధ రంగాల్లో 500 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో 200, ఇంజనీరింగ్ రంగంలో 100, ఆతిథ్య రంగంలో 100, నిర్మాణ రంగం 100 ఉద్యోగాలు ఉన్నాయి.