శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఏడాదికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 3,24,234 కోట్లతో వార్షిక పద్దును ప్రకటించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అంబేడ్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీలో బడ్జెట్ కు ఆమోదముద్ర వేశారు.

