అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని తెలిపారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి అవకాశాల కోసం ఎదురుచూడలేదని కేటీఆర్ తెలిపారు. అద్భుతమైన పాలసీలు తయారుచేశామని.. మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.

