
తెలంగాణ జిల్లాలకు అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, వరంగల్, సూర్యాపేట, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కాసేపట్లో వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.