
ముగ్గురు తెలంగాణ కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్షణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను ఇచ్చారు. తన వద్ద ఉన్న పదకొండు శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించే ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి.