తెలంగాణలో డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ లో కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కూడా హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడం, స్థానిక డీసీసీలను సమర్ధవంతంగా నియమించడం ముఖ్య అంశాలుగా చర్చించబడ్డాయి.

