
తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీసులు నిషేధించబడిన CPI (మావోయిస్ట్) సంస్థకు చెందిన 20 మంది సభ్యులను అరెస్టు చేసారు. వీరివద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని అధికారులు శనివారం తెలిపారు. కర్రెగుట్ట కొండల్లో తలదాచుకున్న మావోయిస్టు కేడర్లు ‘సిఆర్ఫిఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసుల సంయుక్త కార్యకలాపాల కారణంగా చిన్న చిన్న గుంపులుగా చెల్లాచెదురుగా పారిపోతున్నారనే నిఘా సమాచారం మేరకు ఈ అరెస్టులు జరిగాయి.