తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. రేపు, ఎల్లుండి తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. మెజారిటీ రాష్ట్రాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

