
పిసిసి చీ ఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతు ఆదివారం జరిగిన బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కెసిఆర్‌అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ బిక్షతో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కెసిఆర్‌కు గుండెల్లో గుబులు మొదలయ్యిందన్నారు. మీ పదేళ్ల బిఆర్‌ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు.