పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్‌కు ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాయని, మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వాటికి నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదని, అమిత్ షాను కలిసి మరోసారి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలిలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

