
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి.ఆదివారం ఉదయం 6 గంటలకు బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరిచిన అనంతరం ఆలయాన్ని దాదాపు 40 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా భారత సైన్యం గర్హ్వాల్ రైఫిల్స్ బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది. చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30న ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛారణలు, ఆచారాల మధ్య అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ధామ్ తలుపులు తెరుచుకోగా.. మే 2న కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకున్నాయి.