వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. “తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే మత్స్యకారులను అప్రమత్తం చేయండని స్పష్టం చేశారు.

