మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ నిర్వహించిన చంద్రబాబు, కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో తుపాను బాధితులతో మాట్లాడారు. సహాయ పునరావాస కేంద్రానికి వెళ్లిన సీఎం చంద్రబాబు తుపాను బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుమార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంటపొలాలను పరిశీలించారు.

