తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని బీచ్‌లు, సూర్యలంక బీచ్‌తో పాటు చీరాల పరిధిలోని బీచ్‌లు సైతం మూసివేశారు. తుఫాను కారణంగా సోమవారం నుండి తాత్కాలికంగా మూసివేత ఉంటుందని, భక్తులు యాత్రికులు సముద్ర తీరానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో తిరుపతిలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు అక్కడే వసతి, ఆహారం సదుపాయాలు ఏర్పాటు చేశారు. సాయం కొరకు 24 గంటలు టోల్ ఫ్రీ నంబర్లు 0877 – 2256776, 9000822909 అందుబాటులోకి తెచ్చారు.

