తుంగతుర్తి ఎస్ఐ వేధించడంతోనే మా అమ్మ చనిపోయిందని మృతురాలి కూతురు ఆరోపణలు చేసింది. పోలీసులు వేధించడంతోనే వెంపటి గ్రామానికి చెందిన సోమ నర్సమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణల వినిపిస్తున్నాయి. ఓ బంగారం చోరీ కేసులో ఎస్సై స్టేషన్ కు పిలిపించి వేధింపులకు దిగారని, తన తల్లి ఏ నేరం చేయలేదని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోవడంలేదన్నారు నేరం ఒప్పుకోవాలని ఎస్సై ఇబ్బందులకు గురిచేయడంతో తన తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు.

