
తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్లాష్ ఫ్లడ్స్పై వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏరులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల, కండలేరు జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.