
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆర్థికంగా వెనకబడిన పేద హిందువులకు ఉచితంగా వివాహాలు చేస్తోంది. వధూవరులు చట్టబద్దంగా పెళ్ళి చేసుకునే వయసు కలిగివుండాలి. అంటే అమ్మాయి 18 ఏళ్లు, అబ్బాయి 21 ఏళ్లు పైబడి వయసు కలిగివుండాలి. ప్రేమ వివాహాలు, రెండో పెళ్లిళ్లు చేసుకునేవారికి తిరుమలలో అవకాశం ఉండదు. వధూవరుల తల్లిదండ్రులు తప్పకుండా పెళ్లికి హాజరుకావాల్సి ఉంటుంది. టిటిడి వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో అబ్బాయి, అమ్మాయి తో పాటు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి. అందరి ఆధార్ కార్డులను అప్ లోడ్ చేయాలి.