
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనం కోసం దర్శన టికెట్లు, టోకెన్లతో వచ్చే భక్తులు నిర్దేశిత సమయంలోనే రావాలని కోరింది. శ్రీవారి దర్శనం టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే దర్శనం కోసం క్యూలైన్లలోకి రావాలని కోరారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.