
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సోమవారం ఉదయం వరకూ తలుపులు మూసివేయనున్నారు.
మరోవైపుచంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంనుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ నిలిపివేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబరు 8న ఉదయం 8.30 గంటల వరకూ అన్నప్రసాద వితరణ ఉండదు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు అన్నప్రసాదాల పంపిణీ పునః ప్రారంభిస్తారు.