
రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని, రేయి పగలు అన్న తేడా లేకుండా ఎండ వానను లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం రోజూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు.
వ్యవసాయ పనులు వదిలేసి మరీ యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నా బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.