పసి పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లులకు నెస్లే సంస్థ ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నమ్మే నెస్లే బేబీ ఫుడ్ బ్రాండ్లయిన SMA, NAN, BEBA ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన ‘సిర్యూలైడ్’ టాక్సిన్ ఉన్నట్లు.. తాము గుర్తించామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు బ్యాచ్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ రీకాల్‌ను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

