
వచ్చే 3 నెలలపాటూ.. భారీగా ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం IVRSని ఉపయోగించబోతోంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల గురించి అడుగుతారు. ప్రజలు ఇచ్చే సమాధానాన్ని బట్టీ.. ఆ పథకం తీరుతెన్నులు ఉంటాయి. ఈ సర్వే కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు. దీని ద్వారా.. ప్రతీ పథకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలిసిపోతుంది.