తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన విజయ్, తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్ , తిరుచి ఈస్ట్ అనే రెండు అర్బన్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.విజయ్ వ్యాసర్‌పడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్‌ను దాఖలు చేశారు. విజయ్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

