బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు, తిరువారూర్, మైలాడుదురై, నాగపట్టణం జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తుండడంతో వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది. రామేశ్వరం రైల్వే స్టేషన్ నీట మునిగింది. వందలాది గృహాలు వరదనీటిలో తేలియాడుతున్నాయి. తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం, మైలాడుదురై జిల్లాల్లో 100కుపైగా గృహాలు కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.భారీ వర్షాల కారణంగా ప్రమాదాలబారిన పడి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆరుగురు మృతి చెందారు.

