తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి పార్టీల్లో విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి.రాష్ట్ర ప్రభుత్వంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్న కాంగ్రెస్ నేతల డిమాండ్‌పై డీఎంకే సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రి పదవినే కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య సాగుతున్న బాహాట విమర్శలు కూటమి ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. డీఎంకే ఎమ్మెల్యే జి. తలపతి .. కాంగ్రెస్ ఎంపీలు బి. మాణిక్యం ఠాగూర్ , ఎస్. జోతిమణి లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

