
కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణ భారత సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజా వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. “నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను. మన దేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాను. కర్ణాటకపై నాకున్న ప్రేమ నిజమైనదే. ఇదే విధంగా ఆంధ్రా, కేరళ పట్ల కూడా. నా జీవన శైలి ఇది. దయచేసి దానిని లాగకండి” అని అన్నారు.