నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం 14 కేసులు నమోదు చేసింది. ‘నాపై అక్రమ కేసులు మీతో సంబంధం లేకుండా నమోదు చేసి ఉంటే వాటిపైన సీబీఐ చేత విచారణ జరిపించి నిజనిజాలు నిగ్గు తేల్చి నాపై మోపబడిన కేసులు సీబీఐ విచారణలో రుజువైతే ఏ విక్షకైనా సిద్ధంగా ఉన్నాను’అని మాజీమంత్రి లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణ కోరుతూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

