మహారాష్ట్రలో హెడ్ కానిస్టేబుల్ జయంత్ కుమార్తె ఆర్య… ఆశిష్ ప్రేమను తండ్రి వ్యతిరేకించడంతో, 2023 ఏప్రిల్ 25న తండ్రికి మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చింది. అప్పట్లో దీనిని ‘ప్రమాదవశాత్తు మరణించినట్టుగా భావించిన పోలీసులు కేసును మూసివేశారు. తండ్రి మరణం తర్వాత ఆర్య పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందింది.ఆమె ప్రియుడు ఆశిష్ కూడా 2025లో పోలీసుగా ఎంపికయ్యాడు. ఇద్దరూ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న ఆశిష్, ఫిర్యాదు చేసి అసలు నిజాన్ని బయటపెట్టాడు.

