ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PML) సెక్షన్ 19 కింద అరెస్టు చేసింది. అల్ ఫలాహ్తో సంబంధం ఉన్న చోట్ల జరిగిన సోదాల సమయంలో లభించిన ఆధారాల ఆధారంగా ఈడీ చర్యలు తీసుకుంది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం NAAC అక్రిడిటేషన్పై తప్పుడు ప్రకటనలు చేసిందని.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వాటాదారులను తప్పుదారి పట్టించి లాభాలను ఆర్జించిందని ఎఫ్ఐఆర్లో ఆరోపించారు.

