దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. హోం మంత్రి అమిత్‌షాకు ఫోను చేసి మాట్లాడారు. పేలుడుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమిత్‌షా సైతం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్‌తో కూడా అమిత్‌షా మాట్లాడారు.

